హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఇల్లు దాటి బయటకు రావాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో భరించలేని వేడితో జనం అల్లాడిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు వడగాల్పుల దెబ్బకు అస్వస్థతకు గురవుతున్నారు. అయితే దుకాణాలు, ఆఫీసులు, ఇతర సంస్థల్లో విధులు నిర్వర్తించే వారు వేసవి తాపం నుంచి ఊరట పొందేందుకు ఏయిర్ కండిషన్లు, కూలర్లు వంటివి సమకూర్చుకుంటున్నారు. అయితే తాజా సమాచారం మేరకు ఈరోజు రేపు కొంత వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉండనుందని అంటున్నారు..హైదరాబాద్ వాతావరణ అధికారులు. ఉష్ణోగ్రతలు కూడా 42 డిగ్రీల వరకు రికార్డ్ కానున్నాయని..వీటికి తోడు ఉరుములతో కూడిన..జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.

webtech_news18