హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : తిరుమల శ్రీవారికీ ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్ ...

ఆంధ్రప్రదేశ్21:03 PM October 11, 2019

శ్రీవారికి భక్తులు సమర్పించే హుండీ ఆదాయం గత కొన్ని మాసాలుగా తగ్గిపోవడం టీటీడీ గణాంకాల ద్వారా కనబడుతున్నది. 20 సంవత్సరాల ముందు తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ 30 నుంచి 40 వేల మంది వరకు ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 70 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఉండేది. తరువాత కాలంలో భక్తుల సంఖ్య పెరగడం తో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగినది. గత మూడు మాసాల ముందు వరకు సరాసరి రోజు 3.50 కోట్ల నుండి 3.90 కోట్ల వరకు శ్రీవారి హుండీ ఆదాయం లభించిందని దేవస్థాన అధికారులు వెల్లడించారు. గత మూడు నాలుగు మాసాలు గా శ్రీవారి హుండీ ఆదాయం ఇంత పెద్ద స్థాయిలో తగ్గిపోవడానికి గల కారణాలను వెల్లడించడానికి అధికారులు ముందుకు రావడం లేదు. కానీ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నారని టీటీడీ గణాంకాలు చెబుతున్నాయి. గతంలో స్వామివారి దర్శనం చేసుకునే భక్తులు సంఖ్య పెరిగినప్పుడు హుండీ ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ ఇందుకు భిన్నంగాగత మూడు మాసాలుగా భక్తుల సంఖ్య పెరిగినా కూడా శ్రీవారి హుండి ఆదాయం తగ్గుదల కనిపిస్తున్నది. ఇందుకు కారణం దేశంలో నెలకొన్న ఆర్ధిక మాంద్యం అని టీటీడీ నుండి గొంతులు వినిపిస్తున్నాయి.

webtech_news18