రాజధాని కోసం పోరు బాట పట్టిన అమరావతి రైతులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. రైతులు, మహిళలు ఇవాళ చినకాకాని వద్ద జాతీయరహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించారు. అమరావతి ఐకాస పిలుపుమేరకు జాతీయ రహదారిపై బైఠాయించి పోలీసుల బూట్లు తుడుస్తూ నిరసన తెలిపారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు ఎక్కడికక్కడ రైతులను అరెస్టు చేసి హాయ్‌ల్యాండ్, గుంటూరుకు తరలించారు. రైతులు హాయ్‌ల్యాండ్‌లో ఎండలోనే కూర్చుని నిరసన తెలిపారు. వేలాది మంది రైతులు హైవేపైకి చేరుకోవడంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.