ప్రకాశం జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకువచ్చింది. అది వెదురు బొంగులతో కూడిన నాటుపడవపై ఉంది. సుమారు 10 అడుగుల ఎత్తున ఉన్న ఈ మందిరంలో గౌతమ బుద్ధుడి ఆకారంలో రాతితో తయారు చేసిన ఓ విగ్రహం ఉంది