గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై గ్రీనరీ నిమిత్తం మొక్కలకు కట్టింగ్, నీరు పోసే పనులు చేస్తున్న ఓ మహిళను ఇన్నోవా కారు డీ కొట్టింది. దీంతో జలసూత్రం లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అవ్వగా చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గుంటూరులో జరిగే ఓ ఫంక్షన్‌కు సినీ నటీనటులు ఇన్నోవా కారులో వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ వాహనంలో నువ్వు తోపురా..సినిమా హీరో సుధాకర్‌తో పాటు హీరోయిన్ కూడా ఉన్నట్లు సమాచారం.