హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: రోజా నాకు కూతురులాంటిది....సీఎం కేసీఆర్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్21:05 PM August 12, 2019

వైసీపీ ఎమ్మెల్యే రోజా తనకు కూతురులాంటిదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ సోమవారం కాంచీపురం అత్తి వరద రాజ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కాంచీపురం వరదరాజు స్వామి ఆలయం దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో రోజా నివాసానికి వెళ్లి భోజనాలు చేశారు. ఈ సంద‌ర్భంగా స్వయంగా రోజా.. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యలకు వడ్డించారు. ఇక రాయలసీమపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఏపీ సీఎం జగన్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సి ఉందన్న ఆయన.. రాయలసీమను రతనాలసీమగా చేసేందుకు తమ వంతుసాయం చేస్తామని వెల్లడించారు.

webtech_news18