హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : మంత్రిని చూసి బోరున ఏడ్చిన విద్యార్థినిలు... ఎందుకంటే...

ఆంధ్రప్రదేశ్11:46 AM August 08, 2019

తమ టీచర్ ఎప్పుడూ తమని పట్టించుకోవట్లేదనీ, క్లాస్‌కి రాగానే... సెల్‌ఫోన్‌లో వీడియోలు చూసుకుంటూ కూర్చుంటున్నారని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి శంకర్ నారాయణకు కంప్లైంట్ చేశారు విద్యార్థినులు. అనంతపురం జిల్లా... సోమందేపల్లిలోని KGBV స్కూల్లో అమ్మాయిల సమస్య ఇది. విషయం తెలుసుకున్న మంత్రి ఆ స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. 9వ తరగతి విద్యార్థినిలు మంత్రి కాళ్ళు పట్టుకొని బోరుమన్నారు. అక్కడి వేధింపులు తట్టుకోలేక పోతున్నామంటూ మంత్రి ముందు కన్నీళ్లు పెట్టారు. ఇకపై సమస్యలు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చినా... ఇక్కడే కాదు... అన్ని KGBVలలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనీ... అన్నింటినీ సరి చేయాలని మంత్రిని వేడుకొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్... తప్పైపోయిందని ఒప్పుకున్నారు. ఈసారికి క్షమించమని మంత్రి ముందే విద్యార్థినులను వేడుకొన్నారు.

Krishna Kumar N