టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ, తోట్లవల్లూరు కరకట్ట పై టిడిపి కార్యకర్తలు రాస్తా రోకో నిర్వహించారు. అదే సమయంలో, అటుగా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వాహనం వచ్చింది. దింతో టిడిపి కార్యకర్తలు రోడ్డుపై ట్రాక్టర్ టైర్ తగులపెట్టారు. ఈ సందర్భంగా వైసిపి కార్యకర్తలు అడ్డుకోవాడానికి ప్రయత్నించడంతో ఇరు వర్గాలు బాహా బాహీ దిగారు.