ఎన్నార్సీ, ఎన్పీఆర్కి వ్యతిరేకంగా ఏపీ సీఎం జగన్... తీర్మానం తేవాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎంపీ నాని. ఎన్నార్సీ (పౌరసత్వ నమోదు రిజిస్టర్), ఎన్పీఆర్ (జాతీయ జనాభా రిజిస్టర్) వంటివి ముస్లింలతోపాటూ... సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయన్న ఆయన... వాటిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తీర్మానం తేవాలన్నారు. 22 మంది ఎంపీలు ఉన్న జగన్... సీఏఏకి అనుకూలంగా ఓటు వేయడం సరికాదన్న ఆయన... రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు.