హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: శేషాచలంలో ఎర్రచందనం స్మగర్ల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్04:21 PM IST Dec 06, 2018

శేషాచలంలో అడవుల్లో మరో ఎర్ర చందనం స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. భీమవరం బీట్ నిలవరాతి కోన ప్రాంతంలో వారికి పలువురు స్మగర్లు తారసపడ్డారు. మొదట ఇద్దరు స్మగర్లను పట్టుకున్న పోలీసులు..వారిచ్చిన సమాచారం ప్రకారం మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి స్కార్పియో వాహనం, భారీగా వంట సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ స్మగ్లర్లంతా తమిళనాడుకు చెందిన వారని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.

webtech_news18