తన కన్నతల్లి చనిపోయినా విజయవాడకు చెందిన ఎస్ఐ శాంతారామ్ ఆమె అంత్యక్రియలకు హాజరుకాలేదు. విజయనగరం జిల్లాలో తల్లి చనిపోతే విజయవాడ నుంచి వెళ్లడానికి 40 చెక్ పోస్టులు దాటాలని, దీని వల్ల కరోనా వ్యాప్తికి ఆస్కారం ఉందన్న కారణంగా ఆయన వెళ్లలేదు. విధులు నిర్వర్తిస్తేనే తన తల్లి ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పారు. కాబట్టి, ప్రజలు కూడా అత్యవసరం అయితేనే బయటకు రావాలని పిలుపునిచ్చారు.