హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : పద్మావతీ అమ్మవారికి ప్రత్యేక సారె

ఆంధ్రప్రదేశ్10:22 AM December 01, 2019

తిరుమల నుంచి పద్మావతీ అమ్మవారి కోసం ఆదివారం ఉదయం సారె తిరుచానూరు చేరుకుంది. పంచమి తీర్థం కార్యక్రమాన్ని పురస్కరించుకుని సారెను ఆనవాయితీగా తిరుమల శ్రీవారి దేవాలయం నుంచీ తిరుచానూరు ఆలయానికి పంపుతున్నారు. ఉదయం 4.30కు తిరుమల స్వామివారి సన్నిధి నుంచీ బయలుదేరిన సారెను ముందుగా ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణ చేశారు. అక్కడి నుంచీ జియ్యంగార్ల మండపం మీదుగా కాలినడకన తిరుపతికి పంపారు. తిరుపతి చేరిన సారె కోదండ రామస్వామి, గోవింద రాజస్వామి ఆలయాల మీదుగా తిరుచానూరులోని కనకమ్మ సత్రాలకు చేరుకుంది. ఆచారంగా వస్తున్న సారెలో పసుపు, కుంకుమ, తులసి మాల, అమ్మవారి చీరలు ఉంటాయి. కనకమ్మ సత్రం నుంచి అలంకరించిన అంబారీ ఏనుగులపై సారెను తిరుచానూరు ఆలయానికి తీసుకువెళ్లి... పంచమి తీర్థం సందర్భంగా వాటిని అమ్మవారికి అలంకరించారు. తిరుమల నుంచి సారె అలిపిరి పాదాల మండపం దగ్గరకు రాగానే... టీటీడీ ముఖ్య అధికారులు అందుకొని తిరుచానూరుకు వేడుకగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇఓ సింఘాల్, అదనపు ఇఓ ధర్మారెడ్డి ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading