తిరుమలలో ఓ పాము కలకలం రేపింది. నిలిపి ఉన్న కారు బ్యానెట్లోకి దూరి ఇంజిన్ దగ్గర తలదాచుకుంది. ఐతే పాము తోకభాగం బయటకు కనిపించడంతో కంగారుపడిన డ్రైవర్.. దాన్ని బయటకు తరిమేందుకు స్థానికులతో కలిసి ప్రయత్నించాడు. కానీ పాము మాత్రం బయటకు రాలేదు. చివరకు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకొని చాకచక్యంగా పామును బయటకు తీశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.