Andhra Pradesh | Amaravati Bandh : అమరావతిలో 29 గ్రామాల రైతులు బంద్ చేస్తున్నారు. విద్య, వ్యాపార సంస్థలు బంద్ పాటిస్తున్నాయి. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్లు అమరావతి జేఏసీ తెలిపింది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. 66 రోజులుగా (నేడు 66వ రోజు) వారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అసలే రాజధాని విషయంలో తమకు న్యాయం జరగట్లేదనే బాధలో రైతులు ఉండగా... అదే అమరావతిలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నవారిపై నుంచీ కొందరు పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగించడం పెద్ద దుమారానికి దారి తీస్తోంది. గ్రామాల్లో మహిళలు స్నానం చేస్తుంటే, డ్రోన్ కెమెరాలు వినియోగించి వాటిని చిత్రీకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను పోలీసులు ఖండించారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.