HOME » VIDEOS » Andhra-pradesh

Video - జగన్‌కి షాక్... వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని రైతుల మద్దతు

ఆంధ్రప్రదేశ్11:31 AM December 20, 2019

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఉండాలన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని నిరసిస్తూ... రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఐతే... ఇక్కడే వారు సీఎం జగన్‌కి ఓ ట్విస్ట్ ఇచ్చారు. నిన్న జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఫొటోలను చూపిస్తూ... శ్రీనివాస రెడ్డికి మద్దతు పలుకుతూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన రైతులు... గోపిరెడ్డి... రాజధాని అమరావతికి అనుకూలంగా మాట్లాడటం తమకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇది నిజంగా ఏపీలో సీఎం జగన్‌కు షాకింగ్ అంశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటివరకూ జగన్‌ సీఎం అయ్యాక.... ఏం చెప్పినా, ఏం చేసినా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా... సరే అన్నారు. కానీ రాజధాని అంశానికి వచ్చేసరికి మాత్రం సీన్ మారింది. అదే ప్రాంతానికి చెందిన నరసారావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి సీఎం అభిప్రాయానికి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. మూడు రాజధానులపై జగన్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి... అసెంబ్లీ, పరిపాలనా విభాగం (సెక్రెటేరియట్) ఓకే చోట ఉండాలన్నారు. అవి రెండు అమరావతిలోనే ఉండాలన్నారు. అదే తన అభిమతం, ఆలోచన అన్న అయా... ఆ విషయంపై తన వాదనను సీఎం జగన్‌కి తెలిపి ఆయన్ను ఒప్పిస్తానన్నారు. వైజాగ్ ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి... దాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెయ్యాలని కోరతానన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చి నష్టపోయామన్న ఆయన... మరోసారి ప్రజలు నష్టపోవడం సరికాదన్నారు. నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చాక... సీఎం సరైన నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయంతో ఉన్నామన్నారు. ప్రజలు అపోహలు పడవద్దన్న గోపిరెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. రాజధాని ప్రాంతంలోని మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్‌ అభిప్రాయంతో వ్యతిరేకిస్తారా అన్న చర్చ జరుగుతోంది.

webtech_news18

Top Stories