ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు నడుం బిగించిన ఏపీ ప్రభుత్వం... 350 ఎలక్ట్రిక్ బస్సులను తేబోతోంది. అద్దె రూపంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టేందుకు ఏపీఎస్ ఆర్టీసీ టెండర్లు పిలిచింది. ఇదే సమయంలో... ఏపీలో ఎలక్ట్రిక్ బస్సులను నడిపితే ఎలా ఉంటుందనే అంశంపై నిపుణుల కమిటీ తమ రిపోర్టును ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఇచ్చాయి. 12 ఏళ్లు నడిచేలా ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీ టెండర్లకు ఆహ్వానించింది. కిలోమీటర్‌కి ఇంతని చెల్లింపులు చేయనుంది. అక్టోబర్ 14 లోపు టెక్నికల్ బిడ్లు వేయాల్సి ఉంటుంది. నవంబర్ 1న ఫైనాన్షియల్ బిడ్, నవంబర్ 6న రివర్స్ బిడ్డింగ్ జరగనుంది. ఏడాదిలోగా ఎలక్ట్రిక్ బస్సులు ఏపీ రోడ్లపైకి వస్తాయి. నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా... ఎలక్ట్రిక్ బస్సులను ఏ స్థాయిలో ప్రవేశపెట్టాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.