హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : గుంటూరులో రోడ్డు ప్రమాదం... ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి...

గుంటూరు జిల్లా... చిలకలూరిపేట పట్టణంలోని NRT సెంటర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జాము 3 గంటలకు... హైవేపై ఆగివున్న లారీని ఫార్చూనర్ కారు... వేగంగా వచ్చి ఢీకొట్టింది. అంతే... కారు నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న 11 మందిలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మగవారు, ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఆరుగురిని GGHకి తరలించారు. తిరుమలలో దైవ దర్శనం చేసుకొని పాలకొల్లు వెళ్తున్న 11 మంది భక్తులు ఫార్చ్యూన్ కారులో ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రాత్రి వేళ కావడం, చీకట్లో అక్కడో లారీ ఆగివుందని క్లియర్‌గా తెలియకపోవడం వల్ల ఆ లారీని ఢీకొట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. వాహనంలో డ్రైవరు ఇరుక్కుపోవడంతో జేసీపీ సాయంతో బయటకు తీసి రక్షించారు. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బు వారి పాలెం గ్రామానికి చెందిన వారు. నరసారావుపేట డీఎస్పీ రామ వర్మ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చనిపోయిన వారు వెంకట్ (30), సూర్య భవాని (22), మనోజ్ (22), గీతేశ్వరి బాబు (4), సోనాక్షి (5)గా గుర్తించారు. రెండు కుటుంబాలకు చెందిన వీరి బంధువులకు సమాచారం చేరవేశారు.

Krishna Kumar N