తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు 9 గంటలకు చిన్న శేషవాహనంపై మాడవీధుల్లో విహరించారు. స్వామివారిని చూసేందుకు అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. శ్వేతవర్ణంలో స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.