రాజధాని వెలగపూడి తాత్కాలిక సచివాలయం వెలుపల మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం జరుగనుండగా, ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురువడంతో సభాస్థలి వద్ద ఏర్పాటు చేసి వేదిక తడిసి ముద్దయ్యింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ నేతృత్వంలో సుమారు రెండు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.