హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : జూనియర్ డాక్టర్‌పై చెయ్యి చేసుకున్న డీసీపీ

ఆంధ్రప్రదేశ్22:08 PM August 07, 2019

కేంద్రం తీసుకొచ్చిన జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల ధర్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ ఎదుట జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. జూ.డాక్టర్ల ధర్నాతో బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జూనియర్ డాక్టర్ల మానవహారాన్ని భగ్నం చేశారు. అయితే ఈ క్రమంలో డీసీపీ హర్షవర్ధన్ ఓ జూనియర్ డాక్టర్‌పై చేయి చేసుకున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై పోలీసుల జులుం ఏంటని జూనియర్ డాక్టర్లు ప్రశ్నించారు.దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం వైపు నుంచి చర్యలు లేకపోతే ఆందోళన మరింత ఉధ‌ృతం చేస్తామని హెచ్చరించారు. ఘటనపై డీజీపీ గౌతమ్ నవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

webtech_news18