ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రైతులను కట్టడి చేసే క్రమంలో కొందరు పోలీసులకు గాయాలు అయ్యాయి. ఆందోళనకారుల మీద కొందరు దుండగులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కొందరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్ తలకు గాయమైంది. మరొకరికి శరీరం మీద గాయాలయ్యాయి. అమరావతి ముట్టడికి భారీగా రైతులు తరలివచ్చారు.