హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : పోలీసులను ఆశ్రయించిన అమరావతి మహిళలు..

ఆంధ్రప్రదేశ్19:50 PM January 09, 2020

అమరావతి కోసం రాజధాని ప్రాంతంలోని రైతులు, స్థానికులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొందరు మహిళలు ఇళ్ల నుంచి బయటకొచ్చి రోడ్లపై నిరసనల్లో పాల్గొంటున్నారు. ఐతే అలాంటి మహిళలపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారు. రాజధాని మహిళలను కించపరుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తుళ్లూరుకు చెందిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజధాని మహిళల్ని నీచంగా అవమానించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టినట్లు పోలీసులకు చెప్పారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18