HOME » VIDEOS » Andhra-pradesh

Video : కరోనా ఎఫెక్ట్.. ఏపీ టీడీపీ కార్యాలయంలో థర్మల్ స్కానింగ్

ఆంధ్రప్రదేశ్14:49 PM March 17, 2020

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పార్టీ నేతలకు, కార్యకర్తలకు పలు సూచనలు చేసిన టీడీపీ... తాజాగా తమ పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ పలు ఆంక్షలు విధించింది. అత్యవసరమైతే తప్ప జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు రావొద్దని టీడీపీ నాయకత్వం స్పష్టం చేసింది. పార్టీ కార్యాలయానికి వస్తున్న చంద్రబాబు సహా అందరికి థర్మల్ స్కానింగ్ చేయాలని నిర్ణయించింది. 100 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత నమోదైన వారిని పార్టీ కార్యాలయంలోకి అనుమతించరాదని పార్టీ నిర్ణయం తీసుకున్నారు. ఎవరినైనా స్కానింగ్ తర్వాతే కార్యాలయం లోపలికి అనుమతించాలని పార్టీ ఆదేశాలు జారీ చేయడంతో... ఈ మేరకు సిబ్బంది కూడా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరిని ఉష్ణోగ్రతల విషయంలో చెక్ చేసి మరీ కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు.

webtech_news18

Top Stories