ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కూడా కేజీ ఉల్లి ధర రూ.100 వరకు పలుకుతోంది. ఉల్లి ధరలు పెరుగుతుండటంతో.. కేంద్రం ఇతర దేశాలకు ఎగుమతులను నిలిపివేసి దిగుమతులు చేసుకుంటున్నది. ఉల్లి ధరలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కిలో ఉల్లిపాయలను కేవలం రూ.40కే విక్రయించేందుకు నిర్ణయించింది. ఏపీలో కిలో ఉల్లి కిలోకు రూ.25గా ప్రభుత్వం అమ్ముతోంది.