హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ఉల్లి కోసం ప్రాణాలు విడిచిన వృద్ధుడు

ఆంధ్రప్రదేశ్11:59 AM December 09, 2019

Andhra Pradesh : దేశమంతా ఉల్లిపాయల కోసం క్యూలైన్లలో యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరులో చాలా మంది గాయాలపాలవుతున్నారు. బీపీలూ, షుగర్లూ పెరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలోని రైతు బజార్‌లో సాంబయ్య (55) ఏకంగా ప్రాణాలే విడిచాడు. ఉదయం ఇంటి నుంచీ బయలుదేరిన సాంబయ్య... ఉల్లిపాయల కోసం క్యూ లైన్‌లో నిల్చున్నాడు. రోజూ లాగే... అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మాకు కావాలంటే, మాకు కావాలి అంటూ ప్రజలు ఉల్లి కోసం చిన్నపాటి యుద్ధం చేశారు. ఇదంతా చూసి ఒక్కసారిగా సాంబయ్యలో ఆందోళన పెరిగిపోయింది. టెన్షన్ వచ్చేసింది. అది ఏకంగా గుండె పోటుకు దారితీసింది. అమ్మో... అమ్మో అంటూ కింద పడిపోయాడు. షాకైన స్థానికులు... అయ్యో ఏమైంది... ఏమైంది... పెద్దాయనకు నీళ్లు పట్టించారు. అంతలోనే ఎవరో 108కి కాల్ చేశారు. గబగబా ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐతే... ఆస్పత్రికి తీసుకెళ్లాక నాడి చెక్ చేసిన డాక్టర్లు... దారిలోనే సాంబయ్య చనిపోయినట్లు చెప్పారు. సాంబయ్య కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రమయ్యారు. ఉల్లిపాయల కోసం ప్రాణాలు విడవడం అందర్నీ కలచివేసింది. ప్రస్తుతం విదేశీ ఉల్లిపాయలు... ఇవాళ హైదరాబాద్‌కి వస్తున్నాయి. అవి తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా చేరడానికి మరో రోజు పట్టొచ్చు. అయినప్పటికీ కొరత మాత్రం తగ్గే అవకాశాలు లేవు. ప్రస్తుతం కేజీ ఉల్లి ఢిల్లీ లాంటి చోట్ల రూ.200 పలుకుతోంది. హైదరాబాద్‌లో కూడా చికెన్ కంటే ఉల్లిపాయల రేట్లే ఎక్కువగా ఉన్నాయి. కేజీ రూ.200 పలుకుతున్నాయి. ఏపీలో ప్రభుత్వం సబ్సిడీ ధరకింద కేజీ రూ.25కి ఇస్తోంది. దాంతో ఉల్లిపాయల కోసం పెద్ద ఎత్తున ప్రజలు క్యూలు కడుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading