హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : సీఎం జగన్‌పై నోబెల్ శాంతి గ్రహీత కైలాశ్ సత్యార్థి ప్రశంసలు..

ఆంధ్రప్రదేశ్21:38 PM January 21, 2020

ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి ప్రశంసలు కురిపించారు. పాఠశాల విద్యలో చేపడుతున్న కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఈ విషయంలో మిగతా రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. మంగళవారం అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌తో కైలాశ్ సత్యార్థి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కైలాశ్ సత్యార్థితో పాటు నర్సారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు జగన్‌ను కలిశారు. అంతకుముందు చేబ్రోలులోని విజ్ఞాన్ యూనివర్సిటీని సందర్శించిన కైలాశ్.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

webtech_news18