Coronavirus | Tirumala : ఎప్పుడూ చూడని పరిస్థితులను ఇప్పుడు చూస్తున్నాం. ఎప్పుడూ వినని వార్తలను ఇప్పుడు వింటున్నాం. తిరుమల శ్రీవారి ఆలయం మూసేయడమనేది చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. కరోనా వైరస్ దృష్ట్యా... తిరుమల ఆలయానికి భక్తుల రాకను పూర్తిగా నిషేధించారు. ప్రస్తుతం తిరుమలతోపాటూ... తిరుమలకు వెళ్లే కనుమ మార్గం, అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులు, కల్యాణకట్ట, మాఢవీధులు, వెంగమాంబ అన్నదాన సత్రం, లడ్డూ ప్రసాద కేంద్రాలు, చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలూ అన్నీ వెలవెలబోయాయి. ఐతే... స్వామివారికి రోజూ చేసే ఆరు కాలాల కైంకర్యాల్ని మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గిన తర్వాత... తిరిగి కొండకు భక్తులను ఆహ్వానిస్తారు. అప్పటివరకూ తిరుమలలో ఇదే పరిస్థితి ఉంటుందని టీటీడీ తెలిపింది.