Tirumala News | కరోనా ప్రభావంతో తిరుమల ఆలయంలో వారం రోజుల పాటు భక్తులకు ప్రవేశం నిలిపివేస్తున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రేపు ఉదయం నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. అయితే, మూలవిరాట్టుకు నిర్వహించే అన్ని రకాల సేవలు యధావిధిగా కొనసాగుతాయని ప్రకటించారు.