ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 వైరస్ ప్రభావం కలియుగ వైకుంఠానికి చేరింది. కరోనా ఎఫెక్ట్ తో భక్తులను తిరుమలలోని ప్రవేశం నిలిపివేయడంతో ఎప్పుడు జనసందోహంతో నిండుగ వుండే తిరుమల ఇప్పుడు ఇలా వెలవెల బోయింది.128 ఏళ్ల తర్వాత ఏడుకొండలవాడి దర్శనం భక్తులకు నిలిచిపోయింది. లక్షలాది భక్తుల గోవిందనామస్మరణలతో మార్మోగే ఈ ఆపదమొక్కులవాడి సన్నిధి మూగబోయింది.