హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : నెల్లూరులో ఉద్రిక్తత... ఆలయ రథానికి నిప్పు... విచారణకు ప్రభుత్వం ఆదేశం...

ఆంధ్రప్రదేశ్15:01 PM February 14, 2020

Temple Chariot Fire : హైందవ మతంలో... దేవుణ్ని ఎంత పవిత్రంగా భక్తులు కొలుచుకుంటారో... ఆ దేవుణ్ని ఊరేగించే రథానికి కూడా అంతే భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తారు. అలాంటిది... నెల్లూరు జిల్లా... బోగోలు మండలం కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథానికి నిప్పుపెట్టారు దుండగులు. పెద్ద మంట వచ్చేలా నిప్పు పెట్టి పారిపోయారు. వెంటనే పెద్ద మంటలు వచ్చి రథం మొత్తం కాలిపోయింది. మంటల్ని ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించేలోపే... రథం మొత్తం కాలిపోయింది. దీనికి కారణం మీరంటే మీరు అంటూ రెండు వర్గాల ప్రజలు తిట్టిపోసుకున్నారు. వారిని శాంతపరిచిన పోలీసులు... ఓ యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఐతే... ఆ పని చేసింది అతనేనా లేక ఇంకెవరైనానా అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు త్వరలో పూర్తి వివరాలు చెబుతామని తెలిపారు.

webtech_news18