ఏపీలోని వెలగపూడి సచివాలయంలో రష్యాకు చెందిన ఎన్ఎన్టీసీ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులతో గురువారం మంత్రి మేకపాటి సమవేశమయ్యారు. ఈ సందర్భంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ గురించి మంత్రికి వారు వివరించారు. కళ్లకు స్మార్ట్ గ్లాసెస్ ధరించి మనుషుల ముఖాలను గుర్తించవచ్చునని మంత్రికి చెప్పారు. ఈ టెక్నాలజీ శాంతిభద్రతలను కాపాడే పోలీస్ శాఖకు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. ఒక సెకనులో వీడియో ఫ్రేమ్‌లో 15 ముఖాలను ఇది గుర్తించగలదని, డేటా బేస్‌లో 10 లక్షల ముఖాలను నిల్వ చేసే సామర్థ్యం ఉంటుందని వివరించారు.