ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను జాప్యం చేసేందుకే సెలెక్ట్ కమిటీకి పంపించారని మండలి ఛైర్మన్ షరీఫ్‌పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. సభ్యుల అభిప్రాయం చెప్పకుండా సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారని.. ఛైర్మన్ నిబంధనలను ఉల్లంఘించారని ధ్వజమెత్తారు.