ఉల్లిపాయల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నిద్రాహారాలు మానుకొని ఉదయం 4 గంటలకే క్యూలో నిలబడ్డారు ఏపీలో ప్రజలు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి సబ్సిడీకి కేజీ ఉల్లిని రూ.25 ఇస్తుండటంతో... ఆ ఉల్లి కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ముసలివాళ్లు, పెద్దవాళ్లు, బీపీలు, షుగర్లూ ఉన్నవాళ్లు కూడా గంటల తరబడి క్యూలైన్లలో ఎదురుచూడాల్సి వస్తోంది. విదేశాల నుంచీ వస్తున్న ఉల్లి ఏపీకి రావడానికి ఇంకా చాలా టైమ్ పట్టేలా ఉంది. ప్రజలు గ్రామ వాలంటీర్ల ద్వారా ఉల్లిని సరఫరా చెయ్యాలని కోరుతున్నారు.