HOME » VIDEOS » Andhra-pradesh

Video : ఓట్ల లెక్కింపు ట్రైనింగ్ మొదలు... అధికారులకు ఏపీ ఈసీ సూచనలు...

ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి ఓటూ నిష్పక్షపాతంగా పక్కాగా లెక్కించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. సచివాలయం 5వ బ్లాక్‌లోని కలెక్టర్ల సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపుపై రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులతో మంగళవారం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందిని ద్వివేది అభినందించారు. దేశం మొత్తంగా అత్యధికంగా దివ్యాంగులు ఏపీలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 18 నుంచి 25 సంవత్సరాలలోపు వయసు కలిగిన యువత కూడా మూడు శాతం అధికంగా ఓటు వేశారన్నారు. రాష్టవ్య్రాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఏ ఒక్క సంఘటన జరగలేదన్నారు. కచ్చితత్వంతో శిక్షణ పొందిన జిల్లా, నియోజకవర్గ స్థాయి సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించి అన్ని విషయాలు తెలియజేయాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి ఓట్ల లెక్కింపు నిష్పక్షపాతంగా జరగాలని ఆదేశించారు.

Krishna Kumar N

Top Stories