హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : తాడిపత్రి ఘర్షణలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మృతి

ఆంధ్రప్రదేశ్13:06 PM April 11, 2019

AP Assembly Election 2019 : అనంతపురం జిల్లా... తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరాపురంలో వైసీపీ - టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త సిద్ధా భాస్కరరెడ్డి చనిపోయారు. అలాగే వైసీపీకి చెందిన కార్యకర్త పుల్లారెడ్డి కూడా మృతి చెందారు. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన మరో ముగ్గురు కార్యకర్తలు గాయపడినట్లు తెలిసింది. రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాల్లో ఘర్షణకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణ జరగడానికి ఓ చిన్న అంశమే కారణంగా తెలిసింది. నాన్ లోకల్‌ వ్యక్తి ఒకరు ఓటు వేయడానికి రావడంతో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారనీ, దాంతో అతనికి అండగా టీడీపీ కార్యకర్తలు నిలవడంతో ఘర్షణ తలెత్తిందని తెలిసింది. ప్రస్తుతం అనంతపురానికి అదనపు కేంద్ర బలగాల్ని పంపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఎదురు దాడులకు దిగకుండా... మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారని తెలిసింది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading