సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకీళ్ల గ్రామంలో మొసలి కలంకలం రేపింది. మత్స్యకారుల వలకు భారీ మొసలి చిక్కడంతో.. అతి కష్టం మీద ఒడ్డుకు తీసుకొచ్చారు. అంత పెద్ద మొసలిని చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.