HOME » VIDEOS » Andhra-pradesh

Video : శ్రీశైలంలో చిరుత సంచారం... భక్తులకు టెన్షన్

ఆంధ్రప్రదేశ్12:55 PM August 30, 2019

Srisailam Temple : శ్రీశైలం పుణ్యక్షేత్రం చుట్టూ... నల్లమల అడవులు, కొండలే ఉంటాయి. పైగా అది టైగర్ రిజర్వ్ ప్రాంతం. అలాంటి ప్రదేశంలో... భక్తులు తిరిగే ప్రాంతంలో... ఓ చిరుతపులి సంచరించిన వీడియో ఒకటి కలకలం రేపుతోంది. పుణ్యక్షేత్రానికి దగ్గర్లోని... బైపాస్ రోడ్డులో చిరుత తిరుగుతున్నట్లు కనిపించడంతో... అప్రమత్తమైన అధికారులు... ఆ రోడ్డులో భక్తులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటువైపు సాక్షి గణపతి ఆలయం, హఠకేశ్వరం, ఫాలధార, పంచధార వంటి ఆలయాలు, యాత్రా స్థలాలు, పర్యాటక ప్రదేశాలున్నాయి. అందువల్ల శ్రీశైలం వచ్చిన భక్తులు తప్పనిసరిగా... వాటిని దర్శించేందుకు, సైట్ సీయింగ్ కోసం అటుగా వెళ్తుంటారు. చాలా మంది ఆటోడ్రైవర్లు, జీపుల డ్రైవర్లు... సైట్ సీయింగ్ కోసం భక్తులను బైపాస్ రోడ్డువైపు తీసుకెళ్తారు. ఇప్పుడు అదే రోడ్డులో చిరుత తిరుగుతూ కనిపించడంతో... ప్రస్తుతానికి అటువైపు భక్తుల రాకపోకలను నిలిపివేశారు. సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్న అధికారులు.... చిరుత పులు ఎటు నుంచీ ఎటు వెళ్లిందీ, ప్రస్తుతం అది ఎక్కడ ఉందన్నదానిపై పరిశీలిస్తున్నారు. త్వరలోనే చిరుతను పట్టుకొని... తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తామంటున్నారు.

Krishna Kumar N

Top Stories