హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : తల్లి ఒడి చేరిన చిన్నారి జషిత్

తూర్పు గోదావరి జిల్లా... మండపేటలో నాల్రోజుల కిందట కిడ్నాపైన నాలుగేళ్ల పిల్లాడు జషిత్ క్షేమంగా తల్లితండ్రుల్ని చేరాడు. తెల్లవారుజామున పిల్లాణ్ని కిడ్నాపర్లు రాయవరం మండలం కుతుకులూరు దగ్గర వదిలి పారిపోయినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు... చిన్నారిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నీరు పెట్టిన తల్లి... జషిత్‌ను దగ్గరకు తీసుకొని... ఆప్యాయంగా హత్తుకుంది. పిల్లాడు క్షేమంగా తమ దగ్గరకు చేరడంతో... తమకు సహకరించిన పోలీసులకు, మీడియాకూ, సోషల్ మీడియాకూ కృతజ్ఞతలు తెలిపారు జషిత్ తల్లిదండ్రులు. పోలీసులు కూడా మీడియా, సోషల్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్లే కిడ్నాపర్లు పిల్లాణ్ని వదిలి పారిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading