విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన కొణిజేటి ఆదినారాయణ కేసీఆర్‌పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఇంద్రకీలాద్రికి మెట్లమార్గంలో వచ్చి బెజవాడ దుర్గమ్మకు మొక్కు తీర్చుకుంటానన్న మాటను ఆదినారాయణ నిలబెట్టుకున్నారు. తెలంగాణకు చెందిన మరో కేసీఆర్ అభిమాని తేజతో కలిసి ఆయన దుర్గగుడి మెట్లమార్గంలో ఇంద్రకీలాద్రికి చేరుకుని మొక్కు తీర్చుకున్నారు. ఆంధ్రాకు చెందిన ఆదినారాయణ కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకోవడంపై హర్షం వ్యక్తం అవుతోంది.