HOME » VIDEOS » Andhra-pradesh

Video: విజయవాడ కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో కార్తీకమాసోత్సవాలు

ఆంధ్రప్రదేశ్14:26 PM November 08, 2019

హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.ఈ నేపథ్యంలో విజయవాడ పాత బస్టాండ్ వద్దగల కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో ఈరోజు ప్రత్యేక హోమాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా లక్ష బిల్వార్చన వైభవంగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుంటూ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు ఇందులో భాగంగా శ్రీ చక్రార్చన మరియు చండి,గణపతి,రుద్ర హోమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.వీటితో పాటు ప్రత్యేక శివాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కార్తీక దీప అలంకరణ కూడా ఆలయ ప్రాంగణం లో నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

webtech_news18

Top Stories