పోలీసులు నియంతృత్వ ధోరణితో ప్రభుత్వ చెప్పు చేతల్లో పనిచేస్తున్నారని విమర్శించారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. మహిళలపై జాలి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఏపీకి రాజధాని అంశం అత్యంత కీలకమైనదన్న ఆయన... సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందనే అభిప్రాయం వ్యక్తమైతే... పరిశ్రమలు వచ్చే అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్నారు. రాజధాని విషయంలో పోరాటం కొనసాగిస్తామన్నారు ఆయన.