తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ఠ బోటు వెలికితీత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐదు రోజులుగా ధర్మాడి సత్యం చేస్తున్న ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. శనివారం తాళ్లుతో లంగర్లు వేసి ప్రొక్లెయిన్ సహాయంతో బోటును వెలికితీసే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు.