క్రైస్త్రవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ మధ్య ఎక్కడ చూసినా బౌన్సర్లను వెంటబెట్టుకుని తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా కనీసం 10 మంది బౌన్సర్లు కనిపిైస్తున్నారు. గతంలో ఒకరిద్దరు వ్యక్తిగత అనుచరులు, సిబ్బందితో మాత్రమే కనిపించే ఆయన.. తాజాగా బౌన్సర్ల సాయం తీసుకోవడం చర్ఛనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో చాలా కాలం తర్వాత తెరపైకి వచ్చిన పాల్ ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో..తనపై దాడులు జరిగే అవకాశముందని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.