హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ప్రమాణ స్వీకారం చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు

జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు, తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాద్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. జనసేన పార్టీ తరపున పోటీ చేసిన గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయన కూడా పార్టీ మారుతారని పుకార్లు షికార్లు చేశాయి. వైసీపీలోకి వెళ్లిపోతారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే తాను జనసేనలోనే ఉంటానని వరప్రసాద్ స్పష్టం చేశారు.

webtech_news18