అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటే... అక్కడి రైతులు చేస్తున్న దీక్షలు 47వ రోజుకు చేరుకున్నాయి. తాజాగా అర్థరాత్రి వేళ వైసీపీ ప్రభుత్వం కార్యాలయాల్ని కర్నూలుకు తరలిస్తుండటాన్ని నిరసిస్తూ... మందడం, తుళ్లూరు, వెలగపూడి రైతులు... 24 గంటల నిరాహార దీక్షలు చేపట్టారు. మందడంలో రైతుల్ని కలిసిన జనసేన, బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. తాడికొండ అడ్డరోడ్డు, కృష్ణాయపాలెం, వెలగపూడి, రాయపూడి, యర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు తదితర ప్రాంతాల్లో రిలే దీక్షలతో పాటు... 24 గంటల దీక్షలకు రైతులు సిద్ధమయ్యారు. వరుసగా నాలుగో రోజు రైతులు, మహిళలు సత్యాగ్రహ దీక్షలు చేపడుతున్నారు. అటు ముస్లిం మహిళల ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి.