నెల్లూరు జిల్లా టీడీపీ నేత బీద మస్తాన్ రావు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దగదర్తి మండలం దామవరంలోని బీఎంఆర్ ఫ్యాక్టరీతోపాటు, చెన్నైలోని ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఐటీ దాడుల తర్వాత ఏపీలో దాడులు జరగడం కలకలం సృష్టిస్తోంది.