లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా దివంగత మహానేత ఎన్టీఆర్కు న్యాయం జరుగుతుందని ఆయన సతీమణి, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీఆర్ చనిపోయిన 23 సంవత్సరాల తరువాత... వాస్తవం ఏమిటనే విషయం రామ్గోపాల్ వర్మ తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో వెలుగులోకి వస్తుందని తాను భావిస్తున్నానని వెల్లడించారు. అదే జరిగితే రెండు దశాబ్దాల తరువాత తనకు న్యాయం జరిగినట్టు అవుతుందని అన్నారు. ఈ అంశంపై ఎంతో సమాచారాన్ని సేకరించిన వర్మ... తనను మాత్రం ఇప్పటివరకు కలవలేదని లక్ష్మీపార్వతి తెలిపారు.