హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : టార్గెట్ 2024... నారా లోకేష్ ఎమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్12:23 PM IST May 28, 2019

ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నాలు చేశారు. రాబోయే ఐదేళ్లు పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదే అని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఓటమి చవిచూసిన మంగళగిరి నుంచే మళ్లీ పోటీ చేస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. 2024లో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఉండి ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడతానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని 2024లో ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలోఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్...ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ కట్ చేశారు.

Krishna Kumar N