హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Vodeo: పేదల ఇళ్లను కూల్చడం సిగ్గుచేటు...వైసీపీపై టీడీపీ ఫైర్

ఆంధ్రప్రదేశ్17:38 PM August 13, 2019

నెల్లూరులో అక్రమ నిర్మాణాల పేరిట టీడీపీ సానుభూతిపరుల ఇళ్లు కూలగొడుతున్నారని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. ఇళ్ల కూల్చివేతలను కోటంరెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.పేదల ఇళ్లు కూల్చేందుకు మంత్రి అనిల్ 500 మంది పోలీసులను పంపించడం సిగ్గుచేటు అని ఈ సందర్భంగా కోటంరెడ్డి మండిపడ్డారు. వైసీపీయే ఎప్పుడూ అధికారంలో ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలని.. త్వరలోనే వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని హెచ్చరించారు. కోటంరెడ్డి అరెస్టుతో నగరంలోని వెంకటేశ్వరపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

webtech_news18