ఈ దేశంలో 100కి 65 కుటుంబాలు ఏటా ఏదో ఒక రకంగా లంచం ఇవ్వాల్సి వస్తోందని అన్నారు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ. లంచం ఇవ్వకుండా పని జరిగే వ్యవస్థ రావాలన్నారు. లంచం ఇచ్చినవారిని కనీసం ఏడేళ్లు శిక్షించాలని చట్టంలో ఉందన్న ఆయన... ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు.